తమిళనాడులో పిడుగుపాటుకు ఇంటర్ విద్యార్థిని సహా ఐదుగురి మృత్యువాత
- నిన్న అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- మృతుల్లో రైతులు, ఇటీవలే పెళ్లైన యువకుడు
- కొబ్బరి చెట్టు విరిగి పడి మరో వ్యక్తి మృతి
తమిళనాడులో నిన్న పిడుగుపాటుకు గురై వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇంటర్ విద్యార్థినితోపాటు ఇటీవలే పెళ్లైన యువకుడు కూడా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ వెంటనే భారీ శబ్దంతో పిడుగులు పడ్డాయి.
ఈ క్రమంలో కాంచీపురంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన యువకుడు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోగా, తిరువళ్లూరు జిల్లా నేమాలూరులో రైతు చంద్రన్, తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యారు నదిలో చేపలు పడుతున్న ఆనందన్, రాణిపేట జిల్లాలో పొలానికి వెళ్తున్న ఇంటర్ విద్యార్థిని మహాలక్ష్మి మృతి చెందారు. నామక్కల్ జిల్లా పరమత్తివేలూరులో పెరుమాళ్ అనే వ్యక్తిపై కొబ్బరి చెట్లు విరిగి పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.