కేరళలో ఏనుగును చంపిన ఘటనపై.. కదిలించే సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
- మానవత్వం మరోసారి విఫలమైందన్న సుదర్శన్ పట్నాయక్
- మానవాళి సిగ్గుపడాలన్న సైకత శిల్పి
- కేరళ ఘటనపై ఆగ్రహం
కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగును కొందరు దారుణంగా చంపిన ఘటనపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బీచ్ వద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. తల్లి ఏనుగు పక్కన గున్న ఏనుగు పడుకుని ఉన్నట్లు అందులో ఉంది. కేరళలో చనిపోయిన ఆడ ఏనుగు, దాని కడుపులోని పిల్లను ఈ సైకత శిల్పం వివరిస్తోంది.
మానవత్వం మరోసారి విఫలమైందంటూ సుదర్శన్ పట్నాయక్ ఆ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో మానవాళే సిగ్గుపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. పూరీ బీచ్‌లో తాను ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ సైకత శిల్పం కన్నీళ్లు పెట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన పలు ఫొటోలు, కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.