భారత్‌-చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి: విదేశాంగ శాఖ

  • సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి
  • సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయి
  • సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరం
లఢఖ్‌లో చైనా సైన్యం దుందుడుకు చర్యలతో ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామని ప్రకటించిన ఇరు దేశాలు తాజాగా చర్చలు జరిపాయి. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. చుషుల్‌-మోల్దో ప్రాంతంలో నిన్న ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ కమాండర్లు ఈ భేటీలో పాల్గొన్నారని వివరించింది.

భారత్‌-చైనా‌ మధ్య సైనిక చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఏర్పడుతోన్న సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయని పేర్కొంది. ధ్వైపాక్షిక బంధాల కోసం సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరమని తెలిపింది.


More Telugu News