అలా చేస్తే రెమ్‌డెసివిర్ పనిచేయదు: యూఎస్ఎఫ్‌డీఏ కీలక సూచన

  • రెమ్‌డెసివిర్ వినియోగానికి యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి
  • క్లోరోక్విన్‌తో కలిపి వాడితే ప్రయోజనం శూన్యం
  • పరిశోధనలు జరుగుతున్నాయన్న ఔషధ నియంత్రణ సంస్థ
కరోనా వైరస్‌తో బాధపడే రోగులకు కొంతవరకు ఉపయోగపడుతోందన్న పరిశోధనాత్మక యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ వినియోగంలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ) మరో కీలక సూచన చేసింది.

బాధితులకు ఈ ఔషధాన్ని క్లోరోక్విన్ ఔషధంతో కలిపి ఇవ్వొద్దని సూచించింది. బాధితులకు క్లోరోక్విన్ ఇస్తూనే మరోవైపు రెమ్‌డెసివిర్ ఇవ్వడం సరికాదని, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదని యూఎస్ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. రెండు ఔషధాలను కలిపి ఇస్తే రెమ్‌డెసివిర్ పనిచేయదని భావిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, పరిశోధనలు జరుగుతున్నాయని వివరించింది.


More Telugu News