రాజధాని రైతుల త్యాగాలు వృథాకానీయం: పవన్ కల్యాణ్
- అమరావతి కోసం రైతుల చేస్తోన్న పోరాటానికి మద్దతు
- 34 వేల ఎకరాల పంట భూములను రైతులు త్యాగం చేశారు
- రాజధాని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు
- బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతాం
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న పోరాటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించారు కాబట్టి రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ పాలన వచ్చింది కాబట్టి రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రైతాంగాన్ని అవమానించడమేనని తమ పార్టీ మొదటి నుంచి చెబుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు రైతులు 200 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు.
బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 29 వేల మంది రైతుల త్యాగాలను వృథా కానివ్వబోమని చెప్పారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని చెప్పుకొచ్చారు.