నాడు కేసీఆర్ కు గుడి కట్టించాడు.. ఈరోజు ఆమరణ దీక్షకు దిగాడు!
- పార్టీ కోసం ఆస్తులను కూడా కోల్పోయాను
- పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదు
- కనీసం కేసీఆర్ దర్శనభాగ్యమైనా కల్పించండి
తెలంగాణ ఉద్యమకారుడు గుండా రవీందర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన వీరాభిమాని. ఆ అభిమానంతోనే కేసీఆర్ కు మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని తన ఇంటి ఆవరణలో గుడి నిర్మించారు. ప్రస్తుతం ఆయన ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం తాను ఆస్తులు కూడా కోల్పోయానని... కానీ, పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపును ఇవ్వడం లేదని అన్నారు. కనీసం కేసీఆర్ దర్శనభాగ్యమైనా కల్పించాలని వేడుకున్నారు.
గతంలో కూడా గుండా రవీందర్ హల్ చల్ చేశారు. హైదరాబాదులోని సీఎం కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. 2001 నుంచి తాను ఉద్యమంలో ఉన్నానని, ఉద్యమకారుడినైన తనకు ఎలాటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పంజాగుట్ట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు మరోసారి ఆమరణ దీక్ష పేరుతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.