రాష్ట్రపతిని కలుస్తాం.. ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేస్తాం: అశోక్ గెహ్లాట్ హెచ్చరిక
- అసెంబ్లీని సమావేశపరచడంపై నిర్ణయం తీసుకోని గవర్నర్
- ఆలస్యంపై నిప్పులు చెరిగిన సీఎం
- ఎమ్మెల్యేలతో చర్చించాక తదుపరి వ్యూహం
తనకు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరిచేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆలస్యం చేస్తుండడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ.. అవసరం అనుకుంటే ప్రధాని నరేంద్రమోదీ ఇంటి బయట ఆందోళనకు దిగుతామని, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలుస్తామని అన్నారు.
తమకు పూర్తి మెజారిటీ ఉందని, అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలని సీఎం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తామని గెహ్లాట్ పేర్కొన్నారు. మరోవైపు, అసెంబ్లీని సమావేశ పరిచే విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ మిశ్రా చెప్పారు.