కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలు ఈ అవమానం భరించాలా?: అసదుద్దీన్ ఒవైసీ

  • అజాద్ బీజేపీతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అనుమానిస్తోంది
  • ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి?
  • కాంగ్రెస్ లోని ముస్లిం నేతలు సమయం వృథా చేసుకుంటున్నారు
మీ పార్టీ అధిష్ఠానానికి ఎంతకాలం బానిసలుగా బతుకుతారో కాంగ్రెస్ లోని ముస్లిం నేతలు ఆలోచించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గులాంనబీ అజాద్ ను బీజేపీతో కుమ్మక్కయ్యారేమో అని కాంగ్రెస్ అనుమానిస్తోందని చెప్పారు. ఒకప్పుడు అజాద్ తమ పార్టీని బీజేపీ బీ టీమ్ అనేవారని.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోని ముస్లిం నేతలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకుంటున్నారని చెప్పారు. ఆ పార్టీలోని ముస్లిం నేతలు ఇలాంటి అవమానాన్ని భరించాలా? అని ప్రశ్నించారు.


More Telugu News