'మోసగాళ్లు' టీజర్ విడుదల చేసిన అల్లు అర్జున్.. టీజర్‌లో ట్రంప్ ప్రస్తావన!
- ఐటీ కుంభకోణం నేపథ్యంలో సినిమా
- మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో చిత్రం
- అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే టీజర్
ఐటీ కుంభకోణం నేపథ్యంలో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటోన్న 'మోసగాళ్లు' సినిమా టీజర్‌ను హీరో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఉదయం విడుదల చేశారు. తన బాల్య స్నేహితుడు, స్కూల్‌మేట్ విష్ణు మంచుకి, కాజల్ అగర్వాల్‌కి, ఈ సినిమా యూనిట్‌కి అభినందనలు అంటూ అల్లు అర్జున్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న ప్రకటనతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. 450 మిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన నిందితులను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని ఆయన అందులో చెబుతారు. నవదీప్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.