నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం: విజయసాయిరెడ్డి

  • రేపు ప్రారంభించనున్న జగనన్న విద్యాకానుక పథకం 
  • 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
  • విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు
ఆంధ్రప్రదేశ్‌లో రేపు ప్రారంభించనున్న జగనన్న విద్యాకానుక పథకం ద్వారా రాష్ట్రంలో 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలతో పాటు మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ వంటి పలు రకాల వస్తువులని తాము అందిస్తున్నామని తెలిపారు.

ఒకటో తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారని ఆయన ట్వీట్లు చేశారు. కాగా, ఈ పథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా మొత్తం 42,34,322 మంది విద్యార్థులకు సుమారు రూ.650 కోట్ల ఖర్చుతో ‘కిట్లు’ అందజేయనున్నారు. అంతేకాదు, ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా ఇస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 


More Telugu News