కొత్త బాధ్యతలను చేపట్టిన మంచు విష్ణు భార్య

  • మోహన్ బాబు కొత్త చిత్రం ప్రారంభం
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు
  • మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్న వెరోనిక
సినీ నటుడు మంచు విష్ణు భార్య వెరోనిక కొత్త బాధ్యతలను చేపట్టారు. తన మామ మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు నటిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికిగాను ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని మోహన్ బాబు నివాసంలో ఈరోజు ప్రారంభమైంది. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మి స్పందిస్తూ, ఈ సినిమా కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నానని తెలిపింది. తన తండ్రికి 'ఆల్ ది బెస్ట్' చెప్పింది.


More Telugu News