గతంలో రిషితేశ్వరి చనిపోతే కేసు కూడా నమోదు చేయలేదు.. ఇప్పుడు స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయం చేస్తోంది: వాసిరెడ్డి పద్మ
- టీడీపీ నేతలపై మండిపాటు
- స్నేహలత హత్యపై మేము సమగ్ర విచారణకు ఆదేశించాం
- హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు
ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడనపల్లెలో స్నేహలత అనే యువతి దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో వారిపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
ఈ రోజు స్నేహలత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో మెడికల్ స్టూడెంట్ రిషితేశ్వరి చనిపోతే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం కేసు కూడా నమోదు చేయించలేదని ఆమె చెప్పారు. ఇప్పుడు మాత్రం స్నేహలత హత్యపై టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
తాము ఇప్పటికే స్నేహలత హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించామని పద్మ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు అవుతుందని తెలిపారు. హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా, తన కూతురిని ప్రేమ పేరుతో రాజేశ్ అనే యువకుడు వేధించేవాడని స్నేహలత తల్లి చెప్పారు. కార్తీక్ అనే మరో యువకుడితో కలిసి తన కుమార్తెను రాజేశ్ హత్య చేసి ఉంటాడని ఆరోపించింది. ఇప్పటికే పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.