కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి.. చిక్కుకుపోయిన 132 లారీలు

  • కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద ఘ‌ట‌న
  • కొన‌సాగుతోన్న స‌హాయ‌క చ‌ర్య‌లు
  • లారీ డ్రైవర్లు, కూలీలను పడవల్లో ఒడ్డుకు చేర్చిన వైనం  
కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగి, 132 లారీలు అందులోనే చిక్కుకుపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

లారీలను ఒడ్డుకు తీసుకొచ్చే  ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా లారీ డ్రైవర్లు, క్లీనర్లతో పాటు లారీల్లో ఉన్న‌ కూలీలను పడవల్లో ఒడ్డుకు తీసుకువ‌స్తున్నారు. కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో లారీలు చిక్కుకుపోయాయ‌ని అధికారులు చెప్పారు. నదిలోకి లారీలు ఇసుక కోసం వెళ్తాయ‌ని వివ‌రించారు. కాగా, వరద కార‌ణంగా రహదారి కూడా దెబ్బతింది.


More Telugu News