ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయపన్ను శాఖ కీల‌క సూచ‌న‌లు

  • 2020-21 మదింపు సంవత్సరానికి రిఫండ్ల‌పై స్పందించాలి
  • నోటీసులకు పన్ను చెల్లింపుదారులు వెంటనే స‌మాధాన‌మివ్వాలి
  • రిఫండ్‌లు చెల్లించేందుకు వీలవుతుంది
ఆదాయ‌ ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆ శాఖ కీల‌క సూచ‌న‌లు చేసింది. 2020-21 మదింపు సంవత్సరానికి (2019-20 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఆదాయపు పన్ను రిఫండ్‌ల కోసం ప‌న్ను చెల్లింపుదారులు విజ్ఞ‌ప్తులు చేసుకోవాల‌ని చెప్పింది. నోటీసులకు పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ స్పందన తెలియజేస్తే వారికే మంచిద‌ని తెలిపింది. దీనివల్ల వారికి రిఫండ్‌లు చెల్లించేందుకు వీలవుతుందని వివ‌రించింది.

కొందరు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డంతో అక్క‌డితో ఈ ప్ర‌క్రియ‌ ముగిసింద‌ని భావిస్తుంటారు. అయితే, ఆ ఐటీఆర్‌లో ఏవైనా సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లోనే పన్ను చెల్లింపుదార్లు త‌మ ప్ర‌శ్న‌ల‌ను నివృత్తి చేసుకోవ‌చ్చ‌ని, వారు ఎంత త్వరగా స్పంద‌న‌ తెలియజేస్తే రిఫండ్‌లు అంత త్వరగా వస్తాయని పేర్కొంది. కాగా, 2020-21 మదింపు సంవత్సరానికి గత వారం మొత్తం రూ.15,269 కోట్ల రిఫండ్‌లు చేసిన‌ట్లు ఇప్ప‌టికే ఐటీ శాఖ వివరించింది.


More Telugu News