స్కిట్ ప్రదర్శించిన కళాకారుల అరెస్టుపై విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు

  • బీజేపీ కార్యక్రమంలో ఒక స్కిట్ వేశారన్న విష్ణు  
  • స్కిట్ ప్రదర్శించిన వారిని అరెస్ట్ చేశారని మండిపాటు 
  • 2021లోని ఘటనను గుర్తు చేసిన వైనం 
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక స్కిట్ ప్రదర్శించారని, అధికార పార్టీకి, కేటీఆర్ కి వ్యతిరేకంగా ఈ స్కిట్ ఉందని ఆయన అన్నారు. అయితే, జరుగుతున్న పరిణామాలను ఒక స్కిట్ రూపంలో ప్రదర్శించిన ఆర్టిస్టులను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. 

"అయితే, 2021లో 'మీ షోలను కేన్సిల్ చేయం' అంటూ మునావర్ ఫారూఖీని కేటీఆర్ ఆహ్వానించినప్పుడు ఇంగ్లిష్ మీడియా ఆయనపై ప్రశంసలు కురిపించింది" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా నాటి ఘటనను గుర్తుచేశారు. 

కాగా, వరంగల్ కు చెందిన ఫోక్ ఆర్టిస్ట్ బారుపట్ల రాజును మంగళవారం హైదరాబాద్ హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తరపున ఆయన స్కిట్ వేశారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.


More Telugu News