ఆ ముగ్గురి ఓట‌మే మా ల‌క్ష్యం: దేవినేని ఉమా

  • విజ‌య‌వాడ‌లో ఉమ్మ‌డి కృష్ణా జిల్లా టీడీపీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం
  • కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాశ్‌ల ఓట‌మే ల‌క్ష్య‌మ‌న్న ఉమా
  • దేవినేని అవినాశ్ రాజ‌కీయ జీవితం ముగిసింద‌ని వ్యాఖ్య‌
  • ఆ ముగ్గురిని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్ట‌కుండా అడ్డుకుంటామ‌న్న మాజీ మంత్రి
టీడీపీ ఉమ్మ‌డి కృష్ణా జిల్లా స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఓ కీల‌క తీర్మానాన్ని ఆమోదించిన‌ట్లు ఆ పార్టీ కీల‌క నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తెలిపారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత మీడియాతో ఉమా మాట్లాడుతూ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాశ్‌ల‌ను ఓడించే దిశ‌గా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని తీర్మానించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ముగ్గురిని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప్ర‌వేశించ‌కుండా తాము అడ్డుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. 

కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాశ్‌లు పోటీ చేయ‌నున్న గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీని ఓడించడ‌మే ల‌క్ష్యంగా సాగ‌నున్న‌ట్లు ఉమా తెలిపారు. దేవినేని అవినాశ్ రాజ‌కీయ జీవితం ఇక ముగిసిన‌ట్లేన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డి, దేవినేని అవినాశ్ రాజ‌కీయంగా నాశ‌నం అయ్యార‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News