ఇండస్ట్రీకే పేరు తెచ్చే హీరో రవితేజ: హైపర్ ఆది

  • 'ధమాకా' ప్రీ రిలీజ్ ఈవెంటులో హైపర్ ఆది 
  • రవితేజ ఎనర్జీ లెవెల్స్ అదుర్స్ అంటూ వ్యాఖ్య 
  • శ్రీలీల గ్లామర్ ప్లస్ పాయింట్ అని వెల్లడి 
  • ఆమెలాంటి లవర్ ఉండాలనిపిస్తుందంటూ నవ్వులు  
రవితేజ - శ్రీలీల జంటగా 'ధమాకా' సినిమా రూపొందింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన హైపర్ ఆది, ఈ వేదికపై తనదైన స్టైల్లో మాట్లాడాడు. 

"నేను ఈ సినిమాను ఒక ఆడియన్ లా చూశాను .. చాలా బాగా వచ్చింది. రవితేజగారి ఎనర్జీని నేను ప్రత్యక్షంగా చూశాను .. ఆయన పొద్దున్నే మేకప్ వేసుకునేప్పుడు ఎంత ఎనర్జీతో ఉంటారో .. పేకప్ అయ్యే సమయానికి కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ ను ఈ సినిమాతో మరోసారి చూస్తారు" అని అన్నాడు. 

"రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో 'ధమాకా' కూడా చేరబోతోంది. శ్రీలీల గురించి చెప్పాలంటే లవర్ లేనివాడు .. ఈ అమ్మాయిలాంటి లవర్ ఉండాలని అనుకుంటాడు. లవర్ ఉన్నవాడు ఈ అమ్మాయిని చూస్తే, ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది అనుకుంటాడు. నిజం చెప్పాలంటే నాక్కూడా అలాంటి ఫీలింగే ఉంది" అంటూ నవ్వేశాడు. 

"రవితేజగారి విషయానికొస్తే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బేసిగ్గా స్టార్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునేవారు. రెండు ఇండస్ట్రీకే పేరు తెచ్చేవాళ్లు. ఇండస్ట్రీకే పేరు తెచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే అది రవితేజగారే. రవితేజగారి ఎనర్జీ .. ఎంటర్టైన్ మెంట్, శ్రీలీల గ్లామర్ .. ఆమె పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు" అని చెప్పాడు.


More Telugu News