హైదరాబాద్‌పై రజనీకాంత్ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసిన మంత్రి కేటీఆర్
- రజనీకాంత్ హైదరాబాద్‌ను చూసి అమెరికాలో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారన్న కేటీఆర్
- రజనీకాంత్‌కు కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించలేదని చురకలు
- అరికెపూడి గాంధీని మరోసారి గెలిపించాలని శేరిలింగంపల్లివాసులకు విజ్ఞప్తి
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్‌ను చూసి అమెరికాలో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారని, సూపర్ స్టార్‌కు కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో భాగ్యనగరాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. అందరూ కూడా ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి అరికెపూడి గాంధీని మరోసారి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆసరా పెన్షన్లను రూ.5వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు రూ.3వేల పెన్షన్ ఇస్తామన్నారు. నరేంద్రమోదీ హయాంలో సిలిండర్ ధర భారీగా పెరిగిందన్నారు. అరికెపూడి గాంధీని మరోసారి గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్ ధన్ ఖాతా తెరవమని చెప్పి ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.