సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ

  • మహిపాల్ రెడ్డి సహా రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లు వెల్లడి
  • అనవసరంగా ఊహాగానాలు వద్దన్న గూడెం మహిపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో పాటు, తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టం చేశారు. అనవసరంగా ఎలాంటి ఊహాగానాలు వద్దని మీడియాకు హితవు పలికారు. 

ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు... సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే.

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలలో లేదా పర్యటనలో తమకు పోలీస్ ఎస్కార్ట్‌ను తొలగిస్తున్నట్లు వారు ఇంటెలిజెన్స్ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశముందని హెచ్చరించారు.


More Telugu News