ఇవి విజయోత్సవాలు కాదు.. వికృత ఉత్సవాలు: బండి సంజయ్

  • పిల్లలకు పురుగులన్నం పెట్టడం కాంగ్రెస్ దృష్టిలో విజయమన్న సంజయ్
  • పిల్లల చావులు ఉత్సవమని మండిపాటు
  • ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? అని ప్రశ్న
ఏడాది పాలనలో ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ...' కాంగ్రెస్ పార్టీ దృష్టిలో..  పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయం. వారి చావులు ఉత్సవం. యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయం. వారికి సంకెళ్లేయడం ఉత్సవం.  

రైతులను మోసం చేయడం విజయం. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవం. ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం. వారి కన్నీళ్లు ఉత్సవం. ఇళ్లు ఇస్తామని మోసం చేయడం విజయం. ఉన్న ఇళ్లు కూల్చడం ఉత్సవం. రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయం. అప్పులకు నోటీసులివ్వడం ఉత్సవం. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు' అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News