సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం
- మంగళవారం రాత్రి ఎమర్జెన్సీ విధించిన ప్రెసిడెంట్
- విమర్శలు వ్యక్తం కావడంతో బుధవారం ఉదయం ఎత్తివేత
- అధ్యక్షుడి తీరుపై మండిపడుతున్న ప్రతిపక్ష ఎంపీలు
సౌత్ కొరియాలో మంగళవారం ఉన్నట్టుండి ఎమర్జెన్సీ విధించిన ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ పై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఎమర్జెన్సీ విధింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్లు సమాచారం. పార్లమెంట్ లో ప్రతిపక్షానికే మెజారిటీ ఉండడంతో అభిశంసన తీర్మానం నుంచి ప్రెసిడెంట్ యోల్ గట్టెక్కే సూచనలు కనిపించడంలేదని సౌత్ కొరియా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్మానంపై శుక్రవారం పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతుందని, ఆ లోపే అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎమర్జెన్సీ విధింపు, ఎత్తివేత
మంగళవారం రాత్రి టీవీ ప్రత్యక్షప్రసారంలో అధ్యక్షుడు యోల్ సౌత్ కొరియన్లను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండడంతో ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలో అడ్డుకుంటున్నాయని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దాయాది దేశం నార్త్ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేశారు. వారిని కట్టడి చేసి, దేశంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే, ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత రావడం, పార్లమెంట్ కూడా వ్యతిరేకించడంతో బుధవారం ఉదయం మార్షల్ లాను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
మండిపడ్డ ప్రతిపక్షాలు
దేశంలో మార్షల్ లా విధిస్తూ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాదు, అధ్యక్షుడిపై పార్లమెంట్ లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంపై శుక్రవారం పార్లమెంట్ లో ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అధ్యక్షుడు ఈ తీర్మానం గట్టెక్కాలంటే పార్లమెంట్ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది (300 మందిలో 200 మంది ఎంపీలు) ఆయనకు మద్దతుగా ఓటేయాలి. అంతేకాదు, కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు కూడా మద్దతు తెలపాలి. అయితే, పార్లమెంట్ లో ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీకి చెందిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. దీంతో అధ్యక్షుడికి పార్లమెంట్ మద్దతు దక్కడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.