కొడాలి నాని అనుచరుల అరెస్ట్.. పరారీలో ప్రధాన అనుచరుడు కాళీ
- తొమ్మిది మంది కొడాలి నాని అనుచరుల అరెస్ట్
- పెదపారుపూడి పీఎస్ కు తరలింపు
- 2022లో రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసు
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. అప్పుడు జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
తొమ్మిది మంది కొడాలి నాని అనుచరులను గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ పరారీలో ఉన్నారు. ఆయన అసోంకు పరారైనట్టు పోలీసులు గుర్తించారు. కాళీ కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు.