2024 ఏడాదిలో చివరి ట్రేడింగ్ రోజు... భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ బలహీన సంకేతాల ప్రభావం
- 413 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 117 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈరోజుతో 2024 ముగుస్తోంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమయింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల కారణంగా సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఉదయం 1.28 గంటల సమయంలో సెన్సెక్స్ 413 పాయింట్ల నష్టంతో 77,809 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 23,521 వద్ద ట్రేడ్ అవుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, జొమాటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీలు టాప్ లూజర్లుగా ఉన్నాయి.