ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత.. వీడియో ఇదిగో!
--
ఒడిశా అడవుల్లో అత్యంత అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నల్ల చిరుతలు ఒడిశా అడవుల్లో కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని వివరించారు. తాజాగా ఈ చిరుత నాయాగఢ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రేమ్ కుమార్ ట్వీట్ చేశారు. సెంట్రల్ ఒడిశాలో అత్యంత అరుదుగా నల్ల చిరుతలు కనిపిస్తాయని చెప్పారు. జంతువుల కదలికలను, వాటి సంఖ్యను గుర్తించేందుకు అమర్చిన ట్రాప్ కెమెరాలో ఈ బ్లాక్ పాంథర్ కనిపించిందని, బిడ్డను నోట కరిచి తీసుకెళుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయని వివరించారు. తన ట్వీట్ కు వీడియోను కూడా జతచేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.