తమిళనాడులో ఘోర ప్రమాదం... బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

  • మంటల్లో చిక్కుకుని ఆరుగురు దుర్మరణం
  • శనివారం తెల్లవారుజామున ప్రమాదం
  • సాతూర్ కర్మాగారంలో భారీగా ఎగిసిపడిన మంటలు
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది కార్మికులు గాయపడ్డారు. విదుర్ నగర్ జిల్లాలోని సాతూర్ గ్రామంలో చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయని, భారీ శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిపారు.

ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో గంటల తరబడి శ్రమించి మంటలు ఆర్పివేశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమేంటనే విషయం ఇంకా తెలియరాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు కోలుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.


More Telugu News