విశాఖలో నేవీ డే వేడుకలు... కుటుంబ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

  • భారత నేవీ విన్యాసాలకు వేదికగా విశాఖ ఆర్కే బీచ్
  • ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
  • నేవీ విన్యాసాలను ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు, భువనేశ్వర్, దేవాన్ష్
విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు వేదికగా నిలిచింది. ఇక్కడి ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన నేవీ డే వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్లపై నిషేధం విధించారు. 

ఈ విన్యాసాల్లో వివిధ రకాల యుద్ధ నౌకలు, అత్యాధునిక వ్యవస్థలతో కూడిన లాంగ్ రేంజి యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ పీ8ఐ, నేవీ డోర్నియర్ విమానాలు, హాక్ జెట్ విమానాలు, సీకింగ్ హెలికాప్టర్లు, ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హెలికాప్టర్లు రకరకాలు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అలరించాయి. చంద్రబాబు, భువనేశ్వరి, దేవాన్ష్ ఆ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. 

ఈ కార్యక్రమంలో నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్ కూడా ప్రదర్శించింది. ఇక, చీకటి పడ్డాక సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీప కాంతులతో జిగేల్మన్నాయి. ఆ నౌకలను లైటింగ్ తో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు.


More Telugu News