చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి... తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు ధరించాలని సూచన
- ఇప్పటి వరకు ఎలాంటి హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వెల్లడి
- జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే సమూహాలకు దూరంగా ఉండాలని సూచన
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తోందంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచన చేసింది.
చైనాలో వెలుగు చూసిన కొత్త వైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణలో కేసులు నమోదు కాలేదని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి. రవీంద్ర నాయక్ తెలిపారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ నివేదికలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రంతో కలిసి పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోందన్నారు. 2023తో పోలిస్తే 2024లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల సంఖ్యలో గణనీయమైన మార్పు లేదన్నారు.