నా దృష్టిలో ప్ర‌భాస్ ఒక నార్మ‌ల్ యాక్ట‌రే... మంచు విష్ణు సెన్సేష‌న‌ల్ కామెంట్స్!

  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో క‌న్న‌ప్ప‌
  • జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • దీంతో ముమ్మ‌రంగా ప్ర‌మోష‌న్స్‌
  • తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు  
మంచు మోహ‌న్ బాబు, ఆయ‌న త‌న‌యుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో చిత్ర‌బృందం ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మంచు విష్ణు మాట్లాడుతూ... "నా దృష్టిలో ప్ర‌భాస్ నార్మల్ యాక్ట‌ర్ మాత్ర‌మే. లెజెండ్ యాక్ట‌ర్ కాదు. ఆయ‌న లెజెండ్‌గా మార‌డానికి ఇంకా స‌మ‌యం పడుతుంది. కానీ, మోహ‌న్‌లాల్ మాత్రం లెజెండ‌రీ యాక్ట‌ర్‌. ఎందుకంటే కాలం ఆయ‌న్ను లెజెండ‌రీ న‌టుడిని చేసింది. రాబోయే కాలంలో ప్ర‌భాస్ చేసే సినిమాలు త‌ప్ప‌కుండా ఏదో ఒక‌రోజు ఆయ‌న్ను లెజెండ్‌ను చేస్తాయి అని అన్నారు. 

దీంతో విష్ణు చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. ఇక‌, 'క‌న్న‌ప్ప‌'లో ప్ర‌భాస్ అతిథి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న తాలూకు పోస్ట‌ర్లు, వీడియోలు విడుద‌ల కాగా, మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  


More Telugu News