తెలుగు రాష్ట్రాల్లో నేడు (శుక్రవారం) ఉదయం పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్ల వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,52,670 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,39,940 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే పసిడి రేట్లలో కొంత మేర తగ్గుదల నమోదైంది.

ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹1,14,500గా నమోదైంది. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. కిలో వెండి ధర ₹100 మేర తగ్గి, ప్రస్తుతం ₹2,44,900 వద్ద కొనసాగుతోంది.

ఈ ధరలు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి ప్రధాన నగరాల్లో దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

అయితే అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, డాలర్ విలువలో మార్పులు, స్థానిక డిమాండ్ వంటి వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు రోజంతా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు ఆభరణాలు కొనే ముందు అప్పటి తాజా ధరలను మరోసారి సరిచూసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.