విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా 'రణబాలి' చిత్రంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. వలస పాలన నాటి అణచివేతను, రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న కరవు తీవ్రతను, వారి వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం ఆవిష్కరించిందని ఆయన కొనియాడారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలను, వారి ప్రతిఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మరుగునపడిన ఎందరో యోధుల త్యాగాలను, జానపద వారసత్వాన్ని గుర్తుచేయడంలో ఇలాంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరుగునపడిన చారిత్రక అధ్యాయాలను వెలికితీయడం ద్వారా సామూహిక స్మృతులను పరిరక్షించే బాధ్యతను నిర్వర్తిస్తోందని అభినందించారు. "ఈ గొప్ప ప్రయత్నం చేసిన రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, మైత్రీ మూవీ మేకర్స్ బృందానికి నా శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు.