విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

చదువుపై మక్కువతో ఓ పల్లెటూరి అమ్మాయి అంతరిక్షం వైపు సాగించిన అద్భుతమైన ప్రయాణాన్ని టీజర్‌లో భావోద్వేగభరితంగా చూపించారు. అద్భుతమైన విజువల్స్, మనసును హత్తుకునే సన్నివేశాలతో టీజర్‌ను తీర్చిదిద్దారు. "ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం" అనే క్యాప్షన్‌ కథలోని లోతును తెలియజేస్తోంది.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటి శృతిహాసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ అందిస్తున్న సంగీతం ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ టీజర్, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Play video