- సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం షోకు హోస్ట్‌గా సమంత
- చిన్నప్పుడు అమ్మతో కలిసి ఈ షో చూసేదాన్నని వెల్లడి
- ఇది తనకు చాలా ప్రత్యేకమైన క్షణమని భావోద్వేగం
- సోనీ విజ, సోనీ లివ్‌లో ప్రారంభం కానున్న వంటల కార్యక్రమం
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సరికొత్త అవతారమెత్తింది. 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం' అనే వంటల రియాలిటీ షోకు ఆమె వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ షోతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకుంది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. "ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. చిన్నప్పుడు మా ఇంట్లో 'మాస్టర్ చెఫ్' ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. నేను, మా అమ్మ కలిసి ఈ షో చూసేవాళ్లం. అది మా బంధాన్ని మరింత బలపరిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత అదే షోకు నేను సెలబ్రిటీ హోస్ట్‌గా వస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది నిజంగా చాలా స్పెషల్" అని భావోద్వేగంగా పేర్కొంది.
కుటుంబమంతా కలిసి వీక్షించేలాంటి ఒక మంచి టీవీ షోలో భాగం కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, 'మాస్టర్ చెఫ్' అందుకు సరైన వేదిక అని సమంత అభిప్రాయపడింది. ఆహారం మనుషులను దగ్గర చేయడమే కాకుండా, మధుర జ్ఞాపకాలను పంచుతుందని ఆమె పేర్కొంది.
ఈ షోకు చెఫ్ వెంకటేష్ భట్, చెఫ్ శశి చెలియా, చెఫ్ శ్రీయ అద్కా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి సోనీ విజ ఛానెల్‌తో పాటు సోనీ లివ్ ఓటీటీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.