- రాజకీయ మార్పుల తర్వాత యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వ కానుక
- వడోదరలో రూ.20 కోట్ల విలువైన వివాదాస్పద ప్లాట్ కేటాయింపు
- 2014లో తిరస్కరించి, ఇప్పుడు ఆమోదించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
- అంతర్జాతీయ క్రీడాకారుల కోటాలోనే కేటాయించామని ప్రభుత్వ వివరణ
- టీఎంసీని వీడి ఎన్డీఏ వైపు మొగ్గు చూపిన కొన్ని నెలల్లోనే ఈ పరిణామం
భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. వడోదరలోని తాండల్జా ప్రాంతంలో దశాబ్దకాలంగా వివాదంలో ఉన్న విలువైన మున్సిపల్ స్థలాన్ని ఆయనకు కేటాయిస్తూ ఆమోదముద్ర వేసింది. ఆయన టీఎంసీని వీడి, నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) వైపు మొగ్గు చూపిన కొద్ది నెలల్లోనే ఈ నిర్ణయం వెలువడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వడోదరలో యూసుఫ్ పఠాన్ కుటుంబ నివాసానికి ఆనుకుని ఉన్న 978 చదరపు మీటర్ల స్థలం ఇది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.20.5 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ప్లాట్‌లో 500 చదరపు మీటర్ల స్థలాన్ని నివాస అవసరాల కోసం బహుమతిగా ఇవ్వనున్నారు. మిగిలిన 478 చదరపు మీటర్ల స్థలాన్ని మార్కెట్ విలువలో 55% ధరకే పఠాన్‌కు బదిలీ చేయనున్నారు.
ఈ స్థలం కోసం పఠాన్ 2012లోనే తొలిసారి దరఖాస్తు చేసుకున్నారు. భద్రతా కారణాలను చూపుతూ తనకు ఈ స్థలం కేటాయించాలని కోరారు. అప్పట్లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపినా, 2014లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. దీంతో ఈ స్థలంపై ఆక్రమణ ఆరోపణలు, హైకోర్టులో కేసులు నడిచాయి. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయానికి ముందే ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు.
అంతర్జాతీయ క్రీడలలో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులకు భూమి కేటాయించే విధానం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ఒక ప్రత్యేక సందర్భం కాదని అధికారులు చెబుతున్నారు. అయితే, పదేళ్ల క్రితం తిరస్కరించిన ప్రతిపాదనకు ఇప్పుడు, రాజకీయ సమీకరణాలు మారిన తర్వాత ఆమోదం లభించడం గమనార్హం.