- తొలిసారి ఎన్నికల బరిలోకి తెలంగాణ రక్షణ సేన
- వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీకాంత్ గౌడ్
- దసరా పండుగ సందర్భంగా అభ్యర్థిని ప్రకటించిన కవిత
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పార్టీ తరఫున తొలి ఎన్నికల అభ్యర్థిని ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నిలబెడుతున్నట్లు దసరా పండుగ సందర్భంగా ఆమె వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగడం ఇదే తొలిసారి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్... కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచే కవితతో కలిసి పనిచేస్తున్న ఆయన, ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
గత మూడేళ్లుగా బహుజనుల వాణిని వినిపిస్తున్న తమ అధినేత్రి కవిత... అదే స్ఫూర్తితో పార్టీ నుంచి తొలి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన శ్రీకాంత్ గౌడ్‌ను ఎంపిక చేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, ఈ ఎన్నికల కోసం నియోజకవర్గ సమన్వయకర్తగా, పరిశీలకుడిగా సయ్యద్ ఇస్మాయిల్‌ను కవిత నియమించారు.