విశాఖ కంటకుడు చంద్రబాబు: విజయసాయిరెడ్డి
- బాబు కుట్రలో విశాఖ జిల్లా విచ్ఛిన్నమైంది
- విశాఖ జిల్లా అభివృద్ధి కోసమే తపించే నాయకుడు జగన్
- అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా? అని బాబు ప్లాన్స్ వేస్తున్నాడు
- గతంలో కేవలం గ్రాఫిక్స్ తో మాయచేశాడు
'విశాఖ కంటకుడు చంద్రబాబు' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో సుదీర్ఘ వ్యాసం రాసుకొచ్చారు. 'బాబు కుట్రలో విశాఖ జిల్లా ఆయన అధికారంలో ఉండగా విచ్ఛిన్నమైంది' అంటూ ఆరోపణలు గుప్పించారు.
'ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా విశాఖ జిల్లా అభివృద్ధి కోసమే తపించే నాయకుడు జగన్ గారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడటం నుంచి జనం దాహర్తిని తీర్చడం వరకు జిల్లాకు వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివి. అధికారంలోనున్నప్పుడు సముద్రాన్ని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని శాసిస్తానంటూ సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసిన బాబు... ఇప్పుడు విపక్షంలో చేసేదిలేక అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా అని ప్లాన్స్ వేస్తున్నాడు. కేవలం గ్రాఫిక్స్ తో మాయచేశాడు... పెట్టుబడుల సదస్సులు పెట్టాం, రూ.40 లక్షల కోట్లు వచ్చేస్తాయన్నాడు చంద్రబాబు. తీరాచూస్తే సదస్సు పెట్టడానికైన ఖర్చులో సగంకూడా పెట్టుబడులు రాలేదు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
'విశాఖలో ప్రైవేట్ యూనివర్సిటీ కోసం.. ప్రజా యూనివర్సిటీగా వర్థిల్లుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను మసకబార్చాడు, దాదాపు నిర్వీర్యం చేశాడు బాబు. ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా తన వ్యక్తిని పెట్టి.. ప్రైవేట్ యూనివర్సిటీ కోసం పనిచేయించాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ సహా డాటా మొత్తం ఏయూ నుంచి అక్కడకి వెళ్లిపోయేది. ఆంధ్రప్రదేశ్ లోనే తొలి విశ్వవిద్యాలయంగా ఖ్యాతినార్జించిన ఏయూను భ్రష్టుపట్టించేందుకు ప్రయత్నించాడు బాబు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
'అధికారంలో ఉన్నప్పుడు బాబు అంతన్నాడింతన్నాడు.. బాహుబలి స్టైల్ లో గ్రాఫిక్స్ చూపించాడు కానీ, ఏమీ చేయలేదు. ఇప్పుడు విశాఖ జిల్లాపై విషం కక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. వైజాగ్ కంటకుడుగా మిగిలిపోయాడు. జిల్లాలో కొండలు, గుట్టలు, ఇసుక, ప్రైవేట్ ఆస్తులు.. ఏవీ తన కబ్జాకు అడ్డుకాదన్నట్లు వ్యవహరించాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.