కరోనా వ్యాప్తి తగ్గగానే చంద్రబాబు ఈ పని చేస్తారట!: విజయసాయిరెడ్డి
- పార్టీ వ్యవహారాలు కొడుకుకు అప్పగింత?
- వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో నిర్ణయం
- లోకేశ్‌ను ‘కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారికి అనుకూలంగా ఎల్లో మీడియా రాతలు రాస్తోందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
'పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉద్ధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట' అని విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు.