తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 60 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 21 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మూడున్నర శాతం వరకు నష్టపోయిన ఎం అండ్ ఎం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత లాభనష్టాల్లో కొట్టుమిట్టాడాయి. చివరకు లాభాలతో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 38,417 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,355 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ లిమిటెడ్ (1.98%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.87%), టీసీఎస్ (1.64%), ఏసియన్ పెయింట్స్ (1.33%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.13%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.43%), బజాజ్ ఫైనాన్స్ (-2.54%), ఎన్టీపీసీ (-2.43%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.97%), ఓఎన్జీసీ (-1.92%).