దుబ్బాకకు బీజేపీ చేసింది కాకి రెట్టంత: హరీశ్‌రావు ఎద్దేవా
- దుబ్బాకకు టీఆర్ఎస్ ఎంతో చేసింది
- ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారు
- కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాకకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని... బీజేపీ చేసింది కాకి రెట్టంత అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని... దీనికి సంబంధించి ఆ పార్టీకి అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా కౌన్సిల్ సభ్యుడు ఎల్లయ్యతో పాటు దాదాపు 150 మంది ఈరోజు హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకకు వస్తే వారి మైకులు కూడా ఫెయిల్ అయ్యాయని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని... ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు అడ్డుపడిన చరిత్ర ఉత్తమ్ దని విమర్శించారు. టీఆర్ఎస్ ది త్యాగాల చరిత్ర అయితే... కాంగ్రెస్ ది మోసాల చరిత్ర అని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడతాయని అన్నారు.