ఏలూరులో వైసీపీ 10, టీడీపీ 3, జ‌న‌సేన 1, సీపీఐ 1 స్థానాల్లో ముందంజ‌!

  • 41వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి విజ‌యం
  • 50వ డివిజన్‌లో వైసీపీ మేయర్‌ అభ్యర్థి ముందంజ‌
  • గ‌ట్టి బందోబ‌స్తు మధ్య ఓట్ల లెక్కింపు
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో 10 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది. అలాగే, టీడీపీ మూడు డివిజ‌న్లు, సీపీఐ, జనసేన ఒక్కో డివిజన్‌లో ఆధిక్యంలో ఉన్నాయి. మ‌రోవైపు 41వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి 600 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు.  

50వ డివిజన్‌లో వైసీపీ మేయర్‌ అభ్యర్థి నూర్జహాన్‌ 570 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి కన్నబాబు రంగా స్వ‌ల్ప అధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు. 2, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్ల లెక్కింపు తుదిదశకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
 
ఏలూరు నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లకు ఇప్ప‌టికే మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. మిగతా వాటికి మార్చి 10నే ఎన్నికలు జరగ‌గా, వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేసేందుకు హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ రోజు ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. గ‌ట్టి బందోబ‌స్తు మధ్య ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.


More Telugu News