వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు.. నూజివీడులో ఉద్రిక్త వాతావరణం
- నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపు
- వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత వెంకటేశ్వరరావు సవాళ్లు
- రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్
- నూజివీడులో భారీగా పోలీస్ బలగాల మోహరింపు
వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు విసురుకున్నారు. నేడు చర్చిద్దామని అన్నారు.
దీంతో వైసీపీ-టీడీపీ నేతలు, కార్యకర్తల వల్ల శాంతిభద్రతలకు విఘాతం తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాక, కీలక రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నూజివీడులో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.