షాకింగ్ వీడియో.. ఒళ్లోకి కొండ చిలువ వచ్చినా ఈమె ఇంత రిలాక్స్‌డ్ గా ఉందేంటి?
- సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్
- ఒళ్లో భారీ కొండచిలువతో యువతి
- అపాయం కళ్లముందే ఉన్నా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తున్న వైనం
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను షేక్ చేస్తోంది. అది ఓ యువతికి చెందిన వీడియో. ప్రాణాపాయం కళ్లముందే ఉన్నా కూడా ఆమె ఏమాత్రం పట్టనట్టు ఫోన్ చూసుకుంటున్న వైనం నెటిజన్లను ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. తన ఇంటి వసారాలో ఆమె కూర్చుని ఉండగా ఓ భారీ కొండ చిలువ ఆమె ఒళ్లోకి పాకింది. అదేమీ పిల్ల పాము కాదు.. భారీ ఆకారంతో భయంగొలిపేలా ఉన్న కొండచిలువ.
అంత పెద్ద పామును చూసినా కూడా ఆమెకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడంతో నెటిజన్లు షాకైపోతున్నారు. ఒళ్లో పెంపుడు కుక్కను కూర్చోపెట్టుకున్నట్టు కొండచిలువను పెట్టుకోవడం నెటిజన్లకు అసలేమాత్రం రుచించలేదు. జాగ్రత్త.. ఏమాత్రం తేడావచ్చినా దానికి ఆహారమైపోతావంటూ హెచ్చరిస్తున్నారు.
‘‘అది పెంపుడు జంతువు కాదు, క్రూర జంతువు. ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టం’’ అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఆమె ఆహారమైనట్టు మరో వీడియో వైరల్ అవుతుందంటూ మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి ఎవరు? వీడియో ఎక్కడ తీశారు? తదితర అంశాలపై స్పష్టత లేకపోయినప్పటికీ నెటిజన్లను మాత్రం ఈ వీడియో తెగ షేక్ చేస్తోంది. మరి ఆలస్యం చేయకుండా మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.