ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ నేతలు కూడా తామే సీఎం అంటున్నారు: జగదీశ్ రెడ్డి

  • బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్న మంత్రి జగదీశ్ రెడ్డి
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ పోతాయని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ నాయకులు కూడా వారి పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి అని చెబుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. సూర్యాపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ పోతాయన్నారు. సంక్షేమ పథకాలు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత పాలకుల హయాంలో జరగని అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగిందన్నారు.


More Telugu News