ఇరవై ఏళ్ల కిందట ఇలా ఉండేవాడ్ని: ఫొటో షేర్ చేసిన కేటీఆర్

  • సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కేటీఆర్
  • 20 ఏళ్ల నాటి ఫొటో ట్వీట్ చేసిన వైనం
  • కాలం రివ్వున సాగిపోతోందంటూ ట్వీట్
బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపనలో కేసీఆర్ ఎంతటి ప్రధాన పాత్ర పోషించారో, ఆ పార్టీ నిర్మాణం, నిర్వహణలో కేటీఆర్ పాత్ర అంతే కీలకమైనది. 47 ఏళ్ల కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తాజాగా తన పాత ఫొటో ఒకటి పంచుకున్నారు. 

"ఒకప్పుడు ఇలా ఉండేవాడ్ని... 20 ఏళ్ల నాటి ఫొటో ఇది... కాలం రివ్వున సాగిపోతోంది" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ విద్యాభ్యాసం పూర్తయ్యాక అప్పటి యువతరం బాటలోనే అమెరికాలో ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, హైదరాబాద్ తిరిగొచ్చిన ఆయన తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడిగా ఎదిగారు. ఉద్యమంలోనూ, ఆ తర్వాత రాష్ట్ర నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేశారు. 

ఎంతో చొరవతో అన్ని వర్గాలను కలుపుకుని పోయే వ్యక్తిగా... చిన్నా పెద్దా అని తేడా చూడకుండా ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలను కలిగివుండే నేటితరం రాజకీయ నేతగా కేటీఆర్ గుర్తింపు పొందారు.


More Telugu News