బీసీ కమిషన్‌కు విలువలేదని హైకోర్టు చెప్పింది: పాడి కౌశిక్ రెడ్డి
- కరీంనగర్ కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం
- తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న పాడి కౌశిక్ రెడ్డి
- బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్‌లా పని చేస్తోందని ఆరోపణ
బీసీ కమిషన్‌కు విలువలేదని హైకోర్టు చెప్పిందని, అయినప్పటికీ కమిషన్‌పై గౌరవంతో తాము వచ్చామని... కానీ తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన బీసీ సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్గొన్నారు. అయితే ఈ బహిరంగ విచారణలో తమను మాట్లాడనీయడం లేదని కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్‌లా తయారయిందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. అభిప్రాయం చెప్పేందుకు బీఆర్ఎస్ తప్ప ఎవరూ రాలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. కొత్త కమిషన్ వేయాలని కోర్టు చెప్పినప్పటికీ ఈ బహిరంగ విచారణ ఎందుకు చేపరడుతున్నారని ప్రశ్నించారు.
బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్‌పై అభిప్రాయం: కౌశిక్ రెడ్డి
బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్‌పై మా అభిప్రాయం (బీఆర్ఎస్) అంటూ కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు. "మేము ప్రస్తుత పద్ధతులను చట్ట ప్రకారం చెల్లుబాటు కానివిగా భావిస్తున్నాం. కులగణనలో శాస్త్రీయత ఉండి, బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. కానీ బలహీన వర్గాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ గురుకులాలు, బీసీ బంధు వంటి పథకాలతో అండగా నిలిచిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ కమిషన్‌పై నమ్మకం లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరి కూడా హాజరుకాలేదని విమర్శించారు.