ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి స్కోచ్ అవార్డు

  • ఏపీఎస్ ఆర్టీసీకి మరోసారి వరించిన ప్రతిష్ఠాత్మక స్కోచ్ ఆవార్డు
  • ఢిల్లీలో శనివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవం
  • సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తరపున అవార్డు స్వీకరించిన చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు
ఏపీఎస్ ఆర్టీసీకి మరోసారి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది. 2024 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి అవార్డు స్కోచ్‌కు ఏపీఎస్ ఆర్టీసీ ఎంపిక అయిందని సంస్థ ఈడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ, డిజిటల్ టికెట్లు జారీ చేయడం, సంస్థ అన్ని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ ఈ అవార్డుకు ఎంపికయిందని వివరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) వై. శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారని ఈడీ పేర్కొన్నారు. 

కాగా, ఏపీఎస్ ఆర్టీసీ గతంలోనూ స్కోచ్ అవార్డును కైవశం చేసుకుంది.    


More Telugu News