ఫలితాలు వచ్చి పది రోజులైనా సీఎం పేరు ప్రకటించలేదు.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?
- సీఎం పేరు ప్రకటించకుండా ఏక్ నాథ్ షిండ్ అడ్డుకుంటున్నారని ప్రచారం
- అలాంటిదేమీ లేదని కొట్టిపారేసిన శివసేన పార్టీ నేతలు
- మోదీ, షాల నిర్ణయమే ఫైనల్ అంటున్న షిండే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న పూర్తికాగా మూడు రోజుల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ కూడా వచ్చింది. అయినా కూడా పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కాబోయే సీఎంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాల్లో కూటమిలోని బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన (షిండే) చీఫ్ ఏక్ నాథ్ షిండే 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాల తర్వాత బీజేపీలోకి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు చేరారు. దీంతో బీజేపీ బలం 139 మందికి పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా 145 సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ అతి దగ్గరగా ఉంది. మెజారిటీ సీట్లు సాధించిన తమకే సీఎం సీటు దక్కాలని బీజేపీ పట్టుబడుతుండగా, కూటమి ధర్మం ప్రకారం తమ నేత షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. షిండే పాలన కారణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమి మెరుగైన ఫలితాలు సాధించిందని అంటున్నారు. అజిత్ పవార్ వర్గం కనుక కూటమిలో లేకుంటే శివసేన 100 సీట్ల దాకా గెలుచుకునేదని చెబుతున్నారు. బీహార్ లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినా కూటమి ధర్మం పాటిస్తూ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ను సీఎం చేసిన విషయం గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవిపై పీటముడి నెలకొంది.
సీఎం సీటుపై నెలకొన్న పీటముడి విప్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. బీజేపీ సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ లతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టత వచ్చిందని, షిండే పార్టీకి ఉప ముఖ్యమంత్రి పోస్టు ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. భేటీ తర్వాత షిండే మాట్లాడుతూ.. సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా బేషరతుగా మద్దతిస్తానంటూ ప్రకటన కూడా చేశారు. అయితే, ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన తర్వాత నేరుగా తన సొంత గ్రామానికి వెళ్లిపోయారు.
మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని రెండు మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉండిపోయారు. దీంతో బీజేపీపై షిండే అలిగారని, సీఎం పోస్టు తనకే ఇవ్వాలని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. మరోవైపు, సీఎంగా చేసిన తాను ఉపముఖ్యమంత్రి పోస్టును అంగీకరించబోనని షిండే స్పష్టం చేసినట్లు, ఉపముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కూడా తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు.. రకరకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే, తనకు ఆరోగ్యం బాలేకపోవడంతో మీటింగ్ లు రద్దు చేసుకున్నానని, సొంతూళ్లో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నానని షిండే మీడియాతో వెల్లడించారు.
ఓవైపు ముఖ్యమంత్రి పీఠంపై సందిగ్ధత కొనసాగుతుండగానే డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని బీజేపీ నేతలు ప్రకటన చేశారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ నెల 4న బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుందని, 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని వివరించారు. బీజేపీ నేతల ప్రకటన ప్రకారం బుధవారం మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరనేది తేలిపోతుంది. అయితే, మంగళవారం నాటికి కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
సీఎం పేరును ప్రకటించకుండా ఏక్ నాథ్ షిండే అడ్డుకుంటున్నారని, అనారోగ్యం సాకుతో మహాయుతి సమావేశాలకు దూరంగా ఉంటున్నారని తాజాగా ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు, ఫలితాలు వచ్చి పదిరోజులు గడుస్తున్నా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు బీజేపీ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక, సీఎం పేరు ప్రకటనకు సంబంధించి బీజేపీ హైకమాండ్ అబ్జర్వర్లను ప్రకటించింది. దీంతో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి పేరుపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.