Skip to content

రుద్రాక్షమాలను ధరించడం వలన ఫలితం

రుద్రాక్షను పరమశివుడి స్వరూపంగా చెబుతుంటారు .. సాక్షాత్తు సదాశివుడే రుద్రాక్షలో నివాసముంటాడని అంటారు. అలాంటి రుద్రాక్షను తాకడం వల్లనే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తాకడం వల్లనే రుద్రాక్ష పాపాలను హరించి వేస్తుందంటే .. ఇక రుద్రాక్షమాలను ధరించడం వలన ఎంతటి విశేషమైన ఫలితం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. రుద్రాక్షమాలను ధరించడం వలన అనేక వ్యాధులు .. బాధలు .. దోషాలు .. దూరమవుతాయి. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి.

శని ప్రభావం కారణంగా నానా ఇబ్బందులు పడుతోన్నవాళ్లు రుద్రాక్షమాలను ధరించడం వలన .. రుద్రాక్షమాలతో జపం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఎవరైతే రుద్రాక్షమాలను ధరిస్తారో ... అలాంటివారికి దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి. రుద్రాక్ష మాల పవిత్రతను కాపాడుతున్నంత వరకూ అది మహాశక్తిమంతంగా తన ప్రభావాన్ని చూపుతుందనేది మహర్షుల మాట. అందువలన రుద్రాక్షను పరమ పవిత్రంగా చూసుకోవాలి .. అత్యంత భక్తి శ్రద్ధలతో రుద్రాక్షమాలతో జపం చేసుకోవాలి. అప్పుడు ఒక రక్షా కవచంలా తనని ధరించినవారిని అది రక్షిస్తూ ఉంటుంది.  

More Bhakti Articles