Skip to content

సప్తముఖి రుద్రాక్ష ధారణ ఫలితం

గ్రహ దోషాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆయా గ్రహాల దోషాల బారిన పడినవాళ్లు, అందులో నుంచి బయటపడటానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శని దోషం అనగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. శని గ్రహ దోష కారణంగా ఎలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోననీ .. ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు.

శని దేవుడిని శాంతింపజేయడానికి తమకి తెలిసిన పూజలు .. అభిషేకాలు .. దానాలు చేస్తుంటారు. మూగ జీవాల పట్ల కరుణ చూపించడం వలన కూడా శనిదేవుడు ప్రీతి చెందుతాడు. పశువులకు .. పక్షులకు .. చీమలకు ఆహారాన్ని అందించడం వలన శని దోషం ఫలితం యొక్క తీవ్రత తగ్గుతుంది. అలాగే శని దేవుడికి ఇష్టమైన 'సప్తముఖి' రుద్రాక్షను ధరించడం వలన, 'నీలమణి'ని ఉంగరంలో ధరించడం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది. అందువలన శని దేవుడి నుంచి ప్రతికూల ఫలితాలను పొందుతున్న వారు .. అనుకూల ఫలితాల కోసం పైన చెప్పిన విధంగా చేయవలసి ఉంటుంది.     

More Bhakti Articles