కృష్ణుడు ఈ చెట్టుపై కూర్చునే వేణువు ఊదేవాడట

శ్రీకృష్ణుడి పాద స్పర్శతో .. ఆయన జ్ఞాపకాలతో పునీతమైన క్షేత్రంగా 'మధుర' కనిపిస్తుంది. శ్రీకృష్ణుడిని ప్రేమించేవారు .. ఆరాధించేవారు .. ఆయన పాద స్పర్శచే పవిత్రమైన ధూళిని నుదుటున దిద్దుకోవాలనుకునే వాళ్లు 'మధుర'ను తప్పక దర్శిస్తూ వుంటారు. శ్రీకృష్ణుడి లీలా విశేషాలను గుర్తుచేస్తూ ఎన్నో ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి .. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో 'భాండీర వనం' ఒకటిగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపించే పెద్ద రావిచెట్టు క్రిందనే రాధాకృష్ణులకు బ్రహ్మదేవుడు 'గాంధర్వ వివాహం' జరిపించాడని చెబుతారు. ఇక ఇక్కడికి సమీపంలోనే 'వంశీ వటం' దర్శనమిస్తుంది. రాస సమయంలో శ్రీకృష్ణుడు ఈ చెట్టుపై కూర్చునే వేణువు ఊదుతాడట. అందువల్లనే ఈ చెట్టును 'మహారాస వృక్షం' అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ రాత్రి వేళల్లో ఈ చెట్టు పరిసరల్లో వేణునాదం లీలగా వినిపిస్తూ ఉంటుందని చెబుతుంటారు. ఇక్కడ తిరుగుతూ వుంటే ఏదో ఒక మూల నుంచి శ్రీకృష్ణుడు వచ్చేస్తాడేమోనని అనిపిస్తూ వుంటుంది .. ఆయన రాకుండానే వెనుదిరిగినప్పుడు మనసంతా భారమవుతుంది.   


More Bhakti News