కలలో ఈ దృశ్యాలు కనిపిస్తే కంగారుపడవలసిన పనిలేదు
కలలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోతారో అందుకు సంబంధించిన కలలే వస్తుంటాయి. ఒక్కోసారి అసలు సంబంధమే లేని కలలు వస్తుంటాయి. కొన్ని కలలు ఆనందాన్ని కలిగిస్తే .. మరికొన్ని కలలు భయాన్ని కలిగిస్తాయి .. ఆందోళనకి గురిచేస్తాయి. ఒక కల వచ్చినప్పుడు .. అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది.
సాధారణంగా కలలో 'ఎండిపోయిన చెట్టు' కనిపిస్తే, ఉదయం నిద్ర లేచింది మొదలు ఆ విషయాన్ని గురించే ఆలోచించడం జరుగుతూ వుంటుంది. చెట్టు పచ్చగా కనిపిస్తే శుభ శకునం .. ఎండిపోయినట్టుగా కనిపించింది కనుక, ఏదో చెడు జరగనుందని ఆందోళన చెందుతారు. కానీ కలలో ఎండిపోయిన చెట్టు కనిపించడం వలన, ధనప్రాప్తి కలుగుతుందని చెప్పబడుతోంది. ఇక ఒక్కోసారి చాలా ఎత్తునుంచి పడిపోతున్నట్టుగా కల వస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాము. ఇలాంటి కల వచ్చినప్పుడు ఏదో ప్రమాదం జరగనుందని భావించి కలవరపాటుకు లోనవుతుంటాము. కానీ ఇలాంటి కల రావడం వలన కూడా శుభాలే జరుగుతాయట. కనుక ఇలాంటి కలలు వచ్చినప్పుడు కంగారుపడవలసిన పనిలేదు.